pavan kalyan: ‘ఖుషి’ సినిమా షూటింగ్ నాటి ముచ్చట చెప్పిన రేణు దేశాయ్!

  • పవన్‌కు గుర్తింపు తెచ్చిన సినిమా ఖుషి
  • ఆ పాటలో కనిపించిన ‘శునకం’ పేరు బెల్
  • ఆ జ్ఞాపకాలను పంచుకున్న రేణు

 ఖుషి...!
ఇది పవన్ కల్యాణ్‌కు మంచి గుర్తింపునిచ్చిన సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు కుర్రకారుని అప్పట్లో బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. ఈ సినిమాలోని ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అనే పాట ప్రతి ఒక్కరికీ బాగా నచ్చేసింది. ఈ పాటలో ఓ శునకం కనిపిస్తుంది. దాని పేరు బెల్. దీనితో తనకున్న జ్ఞాపకాలను రేణు ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు.

అలాగే బెల్‌తో దిగిన ఫొటోను కూడా రేణు పోస్ట్ చేశారు. ‘‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే పాట చిత్రీకరణ న్యూజిలాండ్‌లో జరిగింది. ఈ పాటలో బెల్ కూడా కనిపిస్తుంది. దీన్ని చూసి చిత్రీకరణలో అంతా భయపడేవారు. నేను ‘ఖుషి’కి సహాయ దర్శకురాలిగా, సహాయ ప్రొడక్షన్ పర్సన్‌గా పనిచేశాను. అంతా బెల్‌ను చూసి భయపడటంతో రెండు రోజులపాటు నేనే దాన్ని చూసుకున్నా. బెల్ చాలా మంచింది. దాంతో చాలా సరదాగా గడిపాం’’ అని తెలిపారు రేణు.

pavan kalyan
renu desai
khushi movie
bell
  • Loading...

More Telugu News