JNU: ఢిల్లీ జేఎన్‌యూ ఎన్నికల్లో సత్తా చాటిన హైదరాబాదీ.. అధ్యక్షుడిగా ఎన్నికైన సాయి బాలాజీ!

  • ఆదివారం వెల్లడైన ఫలితాలు
  • నాలుగు ప్యానెళ్లను గెలుచుకున్న ఐక్య వామపక్ష కూటమి
  • ఉపాధ్యక్షురాలిగా సారిక చౌదరి

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో హైదరాబాదీ సత్తా చాటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను ఆదివారం వెల్లడించారు. ఐక్య వామపక్ష కూటమి (యునైటెడ్ లెఫ్ట్) విజయం సాధించింది. హైదరాబాదుకు చెందిన విద్యార్థి, ఏఐఎస్ఎఫ్ నాయకుడు, రీసెర్చ్ స్కాలర్ ఎన్.సాయిబాలాజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ మొత్తం నాలుగు కేంద్ర ప్యానెళ్లను సొంతం చేసుకుంది. సాయిబాలాజీ అధ్యక్షుడిగా ఎన్నికవగా,  డీఎస్‌ఎఫ్‌ నేత సారిక చౌదరి ఉపాధ్యక్షురాలిగా, ఎస్ఎఫ్ఐకి చెందిన ఎజాజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శిగా, ఏఐఎస్ఎఫ్‌కు చెందిన అముత జయదీప్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.  

JNU
New Delhi
University
Hyderabad
Sai Balaji
United left
Elections
  • Loading...

More Telugu News