Sachin Tendulkar: 'కేరళ బ్లాస్టర్స్' నుంచి బయటకు వచ్చేసిన సచిన్ టెండూల్కర్!

  • 2014 నుంచి కేరళ బ్లాస్టర్స్ వాటాదారుగా ఉన్న సచిన్
  • ప్రసాద్ వి.పొట్లూరితో కలసి వాటా కొనుగోలు చేసిన టెండూల్కర్
  • ఈనెల 29 నుంచి ఇండియన్ సూపర్ లీగ్ ప్రారంభం

ఫుట్ బాల్ జట్టు 'కేరళ బ్లాస్టర్స్'లో తనకు ఉన్న 40 శాతం వాటాను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అమ్మేశాడు. ఈనెల 29 నుంచి ఇండియన్ సూపర్ లీగ్ ప్రారంభమవుతున్న తరుణంలో సచిన్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, కేరళ బ్లాస్టర్స్ నుంచి తప్పుకోవాలనే విషయాన్ని జట్టుతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే నిర్ణయించానని చెప్పాడు. జట్టుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని... కేరళ బ్లాస్టర్స్ ను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉంటుందని తెలిపాడు. కేరళ బ్లాస్టర్స్ తన జీవితంలో ఒక భాగంగా మారిపోయిందని చెప్పాడు. 2014 నుంచి కేరళ బ్లాస్టర్స్ వాటాదారుగా టెండూల్కర్ ఉన్నాడు. ప్రసాద్ వి.పొట్లూరితో కలసి ఆయన ఈ జట్టులో కొంత వాటాను కొనుగోలు చేశాడు.

Sachin Tendulkar
foot ball
kerala blasters
  • Loading...

More Telugu News