ram vilas pashwan: రాంవిలాస్ పాశ్వాన్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు!

  • నా అన్న భవిష్యత్తునే పట్టించుకుంటున్నారు
  • మాకు తీరని అన్యాయం చేస్తున్నారు
  • పార్లమెంటు ఎన్నికల్లో అన్నకు పోటీగా బరిలోకి దిగుతా

లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుటుంబంలోని అంతర్గత విభేదాలు బజారుకెక్కాయి. ఆయనపై ఆయన కుమార్తె ఆశా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల తన తండ్రి వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆమె ఆరోపించారు. కుమారుడు చిరాగ్ రాజకీయ భవిష్యత్తును మాత్రమే తన తండ్రి పట్టించుకుంటున్నారని... తమ విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారని ఆశా దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తన అన్న చిరాగ్ ను ఓడించేందుకు తాను బరిలోకి దిగుతానని ఆశా తెలిపారు. తనకు టికెట్ ఇచ్చి, సహకరించాలని ఆర్జేడీ అధినేత లూలూప్రసాద్ యాదవ్ ను కోరారు.

లోక్ జనశక్తి పార్టీకి అనుబంధంగా ఉన్న దళిత్ సేనకు బీహార్ అధ్యక్షుడిగా ఆశా భర్త అనిల్ కుమార్ సాధు వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. మరోవైపు ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా చిరాగ్ ఉన్నారు. పాశ్వాన్ మొదటి భార్య కుమార్తె ఆశా కాగా... రెండో భార్య కుమారుడు చిరాగ్. రెండో పెళ్లికి ముందే మొదటి భార్యకు పాశ్వాన్ విడాకులు ఇచ్చారు. 

ram vilas pashwan
daughter
asha
chirag
  • Loading...

More Telugu News