kanaka durga: పవన్ సీఎం కావాలంటూ.. దుర్గమ్మ గుడికి మోకాళ్లపై చేరుకున్న ముస్లిం యువకుడు!

  • అమ్మవారిని దర్శించుకున్న ఫయాజ్
  • అరాచక పాలన అంతం కావాలని కోరినట్లు వెల్లడి
  • పవన్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం దక్కుతుందని వ్యాఖ్య

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని విభిన్నంగా ప్రదర్శిస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ షేక్ ఫయాజ్ అనే జనసేన కార్యకర్త ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు నుంచి మోకాళ్లపై నడుస్తూ దుర్గమ్మ గుడికి చేరుకున్నాడు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే పవన్ సీఎం కావాల్సిందేనని వ్యాఖ్యానించాడు.

తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫయాజ్ ఆరోపించాడు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన ముగిసి ప్రజలు మెచ్చే పాలన రావాలని దుర్గమ్మను కోరుకున్నట్లు ఫయాజ్ తెలిపాడు.

kanaka durga
Vijayawada
temple
Jana Sena
pavan kalyan
muslim youth
Telugudesam
harrasment
Andhra Pradesh
  • Loading...

More Telugu News