Telangana: ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న మారుతీరావు.. ‘మమ్మల్ని వదిలేయండ’ని ప్రాధేయపడ్డ అమృత!

  • అమృతను బెదిరించిన మారుతీరావు
  • ఆస్తి ఇవ్వబోనని బెదిరింపు
  • అయినా లొంగకపోవడంతో దారుణ హత్య

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రణయ్ ను తాను జనవరిలో పెళ్లి చేసుకోగానే తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ కుమార్ తనను తీవ్రంగా బెదిరించారని అమృత తెలిపింది. ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వబోమనీ, జీవితమంతా కష్టాలు పడతావని హెచ్చరించారని వెల్లడించింది. దీంతో ‘నాకు ఎలాంటి ఆస్తులు వద్దు. మా మానాన మమ్మల్ని వదిలేయండి’ అని ప్రాధేయపడినట్లు పేర్కొంది.

ఎంతగా బ్రతిమాలినా తన తండ్రి ప్రణయ్ ను కనికరించలేదని అమృత తెలిపింది. తాను ఎక్కడికి వెళ్లినా ఆయనకు క్షణాల్లో తెలిసిపోయేదని వెల్లడించింది. కాగా ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించి అమృత తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana
honour killing
pranay
amruta
  • Loading...

More Telugu News