Ramdas Athawale: పెట్రోలు ధర పెరిగితే మీకు ఇబ్బంది కానీ నాకు కాదు!: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

  • పెట్రో ధరలు ఎంత పెరిగినా ఏం కాదు
  • సొంత వాహనం ఉంటే మీకే ఇబ్బంది
  • మంత్రి పదవి ఊడితేనే నాకు సమస్య

పెట్రోలు ధరలు ఎంత పెరుగుతున్నా తనకొచ్చిన నష్టం ఏమీ లేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం నుంచి అలవెన్స్‌లు వస్తాయని, కాబట్టి పెట్రోలు ధరల పెరుగుదల గురించి ఆలోచించబోనని పేర్కొన్నారు. ‘‘మీకు కనుక వాహనం ఉండి ఉంటే ఇబ్బంది పడేది మీరే.. కానీ ఓ మంత్రిగా నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో పెట్రో ధరల పెరుగుదలపై విలేకరులతో మాట్లాడిన ఆయన కొంత గందరగోళానికి గురై ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు ధరలు పెరిగితే తనకు ఇబ్బంది లేదని, కానీ  మంత్రి పదవి ఊడిపోతే మాత్రం కొంత ఇబ్బందేనని నవ్వుతూ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్న మంత్రి అథవాలే.. వాటిని తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.

Ramdas Athawale
Uninion Minister
fuel prices
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News