pranay: అమృతకు ప్రాణ భయం అవసరం లేదు.. ఎలాంటి ఆపద రాదని భరోసా ఇస్తున్నాం: నల్గొండ ఎస్పీ

  • ప్రణయ్ హత్య కేసు చాలా సెన్సిటివ్
  • కూతురుని నమ్మించి అల్లుడిని హత్య చేశాడు
  • కేసు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం

మిర్యాలగూడలో పరువు కోసం కన్న కూతురు భర్తను తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. కూతురు అమృత ప్రేమించి పెళ్లాడిన ప్రణయ్ ను తండ్రి మారుతీరావు సుపారీ కిల్లర్స్ తో దారుణంగా హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసు గురించి నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ, ప్రణయ్ హత్య కేసు చాలా సెన్సిటివ్ అని చెప్పారు.

 అమృత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నామని చెప్పారు. అమృతకు ఎలాంటి ప్రాణ భయం అవసరం లేదని తెలిపారు. వాళ్ల ఇంటికి వెళ్లడానికి ఆమె భయపడితే, రెస్క్యూ హోమ్ కు తరలిస్తామని చెప్పారు. అమృతకు ఎలాంటి ఆపద రాదని భరోసా ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే కేసుకు సంబంధించి అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. కూతురుని నమ్మించి అల్లుడిని మారుతీరావు హత్య చేశాడని తెలిపారు.

pranay
amrutha
maruthi rao
Nalgonda District
sp
ranganath
  • Loading...

More Telugu News