Chandrababu: ఏపీలో జనసేనతో కలిసి పోరాడుతాం: సీపీఎం నేత బృందా కారత్

  • మోదీ, చంద్రబాబు ఒక్కటే
  • వైఫల్యంలో ఎన్డీఏ నూతన రికార్డులు సృష్టిస్తోంది
  • అన్ని సమస్యలను ఎదుర్కొనేలా సీపీఎంను బలోపేతం చేస్తాం

ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ ఒక్కటేనని.. మోదీ ఆర్థిక విధానాలను టీడీపీ ప్రభుత్వం సమర్థించిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా ఏపీలో జనసేనతో కలిసి పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.

ఈరోజు విజయవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యంలో నూతన రికార్డులు సృష్టిస్తోందని ఆమె విమర్శించారు. ఓవైపు మతతత్వ దాడులు, మరోవైపు ప్రజలపై విపరీతమైన పన్నుల భారం, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుదల వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందన్నారు. భవిష్యత్తులో వీటన్నింటినీ ఎదుర్కొనేలా సీపీఎంను బలోపేతం చేస్తామని బృందా కారత్ స్పష్టం చేశారు.

Chandrababu
brinda karat
modi
janasena
  • Loading...

More Telugu News