steve smith: చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన ఆసిస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్

  • డానీ విల్లీస్ ను పెళ్లాడిన స్టీవ్ స్మిత్
  • 2017లో జరిగిన ఎంగేజ్ మెంట్
  • ఈరోజు చాలా గొప్పగా ఉందన్న స్మిత్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వివాహం ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు అయిన డానీ విల్లీస్ ను పెళ్లాడాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది. సెప్టెంబర్ లో తాను, డానీ ఒకటి కాబోతున్నామని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే స్మిత్ ప్రకటించాడు. 2017లోనే ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగింది.

తన వివాహానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా స్మిత్ పంచుకున్నాడు. 'నా ప్రియ స్నేహితురాలిని ఈరోజు పెళ్లి చేసుకున్నా. ఈరోజు ఎంతో గొప్పగా ఉంది. డానీ చాలా అందంగా కనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు.

steve smith
marriage
Australia
cricket
  • Loading...

More Telugu News