manohar parikkar: ఎయిమ్స్ లో చేరిన గోవా సీఎం పారికర్.. ఇతర మంత్రులకు శాఖల అప్పగింత!

  • పాంక్రియాటిక్ రుగ్మతతో బాధపడుతున్న పారికర్
  • ఇటీవలే అమెరికాలో చికిత్స
  • ఢిల్లీకి వెళ్లే ముందు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తో భేటీ

పాంక్రియాటిక్ రుగ్మతతో బాధ పడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహన్ పారికర్ ఇటీవలే అమెరికాలో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఈరోజు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిపుణులైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

గోవా నుంచి ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన గోవా శాసనసభ స్పీకర్ సావంత్, డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబోలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో లోబో మాట్లాడుతూ, పారికర్ నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు అప్పగించనున్నట్టు తెలిపారు. పరిపాలన సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, కీలకమైన హోమ్ శాఖ, ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖలు మాత్రం పారికర్ వద్దే ఉంటాయని తెలిపారు.

manohar parikkar
aiims
goa
ill
  • Loading...

More Telugu News