Konda Surekha: దమ్ముంటే కొండా సురేఖపై పోటీ చేసి.. గెలువు: ఎర్రబెల్లికి ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడి సవాల్

  • ఎర్రబెల్లికి పాలకుర్తి టికెట్ కేటాయించడంపై రవీందర్ రావు మండిపాటు
  • పాలకుర్తి టికెట్ నాకే ఇవ్వాలి
  • లేకపోతే.. కార్యకర్తల అభీష్టం మేరకు తుది నిర్ణయం తీసుకుంటా

కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడం ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. సురేఖకు టికెట్ ను నిరాకరించడాన్ని కొందరు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఏకంగా ఎర్రబెల్లి దయాకరరావుకు బహిరంగ సవాల్ విసిరారు. దమ్ము, పౌరుషం ఉంటే కొండా సురేఖపై పోటీ చేసి, గెలవాలని ఛాలెంజ్ చేశారు. కొండా దంపతులను శత్రువులుగా చెప్పుకునే ఎర్రబెల్లి... దమ్ముంటే వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి, గెలవాలని సవాల్ విసిరారు.

టీఆర్ఎస్ కార్యకర్తల కోరిక మేరకే తాను పాలకుర్తి నియోజకవర్గం టికెట్ ను కోరుతున్నానని రవీందర్ రావు చెప్పారు. ఎర్రబెల్లికి పాలకుర్తి టికెట్ ఇవ్వడం పట్ల పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులను దయాకరరావు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తనకు పాలకుర్తి టికెట్ ను కేటాయించకపోతే... కార్యకర్తల అభీష్టం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించారు. 

Konda Surekha
palakurthi
takkellapalli ravinder rao
Errabelli
TRS
warangal east
  • Loading...

More Telugu News