Mother Teresa award: నా సేవలు గుర్తించిన వారికి ధన్యవాదాలు: కొరియాగ్రాఫర్‌ లారెన్స్‌

  • ట్విట్టర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేసిన లారెన్స్ 
  • తన ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలతో గుర్తింపు
  • అవార్డు ఇచ్చి సత్కరించిన మదర్‌ థెరిసా చారిటబుల్‌ ట్రస్ట్‌

తన సేవా కార్యక్రమాలు గుర్తించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని నటుడు, దర్శకుడు, కొరియాగ్రాఫర్‌ లారెన్స్‌ పేర్కొన్నారు. ఈయన సేవా కార్యక్రమాలను గుర్తించిన మదర్‌ థెరిసా చారిటబుల్‌ ట్రస్ట్‌ అవార్డు అందించి గురువారం ఘనంగా సత్కరించింది. ఈ సత్కారం అనంతరం లారెన్స్‌ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ది లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న లారెన్స్‌ కష్టాల్లో ఉండే వారికి అండగా ఉంటాడన్న గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు 150 మంది చిన్నారులకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేయించాడు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన కేరళ బాధితులకు కోటి రూపాయలు విరాళంగా అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

Mother Teresa award
Raghava Lawrence
  • Error fetching data: Network response was not ok

More Telugu News