YS JAGAN: ఏపీ ముఖ్యమంత్రి పీఠం వైఎస్ జగన్ దే.. స్పష్టం చేసిన ఇండియా టుడే సర్వే!

  • జగన్ కు జైకొట్టిన మెజారిటీ ప్రజలు
  • రెండోస్థానంలో చంద్రబాబు
  • ప్రభుత్వ పాలనపై సంతృప్తి అంతంతే

2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోయేది ఎవరు? చంద్రబాబు మరోసారి సీఎం పీఠంపై కూర్చుంటారా? వైఎస్ జగన్ పదేళ్ల కల ఈసారైనా నెరవేరుతుందా? అన్న ప్రశ్నలకు జవాబు వచ్చింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వేలో ఏపీ ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు పట్టం కట్టనున్నట్లు తేలింది. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ కే ప్రజామద్దతు ఎక్కువగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎం ఎవరు? అని అడిగిన ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ జగన్ కు ఓటేయగా, మరో 38 శాతం మంది సీఎం చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 5 శాతం మంది ఓటేశారు. ఈ నెల 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 10,650 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేకు తుదిరూపు ఇచ్చారు. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు బాగుందని 33 శాతం మంది చెప్పగా, బాగోలేదని 36 శాతం మంది స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన ఫర్వాలేదని18 శాతం మంది వ్యాఖ్యానించారు.

YS JAGAN
Andhra Pradesh
Chief Minister
Chandrababu
INDIA TODAY MY AXIS INDIA TEAM
SURVEY
  • Loading...

More Telugu News