: ఆరోపణలపై సోనియాకు కురియన్ లేఖ
'1996 కేరళలోని సూర్యనెళ్లి
బాలిక అత్యాచారం కేసు'లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ డిప్యూటీ
ఛైర్మన్ పి.జె.కురియన్ యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీలకు లేఖ రాశారు. కొన్ని రోజుల నుంచి తనపై వస్తున్న ఆరోపణలు, పదవికి రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండు చేస్తున్న వైనంపై కురియన్ లేఖలో వివరించారు. అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయనను.. లేఖలో ఎలాంటి వివరణ ఇచ్చారని అడగగా, అన్ని విషయాలను బయటకు చెప్పనని అన్నారు.