Telangana: ఓదేలును పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్.. అలక వీడి పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్న నేత!

  • కేసీఆర్ హామీతో మెత్తబడిన ఓదేలు
  • ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్న నేత
  • చెన్నూరులో టీఆర్ఎస్ గెలుపునకు కృషి 

టీఆర్ఎస్ నేత నల్లాల ఓదేలు అలకవీడారు. పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడి బుజ్జగించారు. తనకు చెన్నూరు టికెట్ కేటాయించకపోవడంపై ఓదేలు గత కొన్ని రోజులుగా అధిష్ఠానంపై ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే.

కాగా, ఓదేలును తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్.. పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన చల్లబడ్డారు. ఈ విషయాన్ని ఓదేలు స్వయంగా వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ గెలవాలంటే చెన్నూరులో టీఆర్ఎస్ మళ్లీ విజయబావుటా ఎగరేయాల్సిందేనని, కార్యకర్తలు తన వెంట నిలవాలని ఆయన కోరారు.  

Telangana
KCR
Nallala Odelu
Chennur
TRS
  • Loading...

More Telugu News