: శాడిస్టు ఐఆర్ఎస్ ను శిక్షించండి: తెలుగు మహిళల డిమాండ్


గ్రూప్ 2 అధికారిణిపై వేధింపులకు పాల్పడ్డ శాడిస్టు ఐఆర్ఎస్ అధికారి వీరభద్రంపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ తెలుగు మహిళ విభాగం కార్యకర్తలు హైదరాబాదులో డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో ప్రవర్తించిన వీరభద్రాన్ని విధులనుంచి తప్పించాలని డిమాండ్ చేసారు. అతనికి సహకరించిన బాలానగర్ సీఐ శ్రీనివాస్, ప్రభుత్వోద్యోగి స్వామిగౌడ్ ను కూడా శిక్షించాలని నినాదాలు చేసారు. దీంతో సీఐ శ్రీనివాస్ పై సైబరాబాద్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News