BMW: ఇక సెల్ఫ్ డ్రైవింగ్ మోటార్ బైక్‌లు.. ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ

  • మానవ ప్రయత్నం లేకుండానే బైక్ నడపొచ్చు
  • మూలమలుపు, వేగం అన్నీ అదే చూసుకుంటుంది
  • బైక్‌పై మరిన్ని ప్రయోగాలు

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఉత్పత్తిలో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తలమునకలై ఉండగా, ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఏకంగా సెల్ఫ్ డ్రైవింగ్ బైక్‌ను ఆవిష్కరించింది. అద్భుతంగా ఉన్న ఈ బైక్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది. దీనిపై కూర్చుంటే చాలు దానంతట అదే గమ్యస్థానికి చేర్చుతుంది. ఆన్, ఆఫ్ అన్నీ అదే చూసుకుంటుంది. మూల మలుపులు, ఎగుడుదిగుడులు, వేగం.. అన్నింటినీ పక్కాగా గమనిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుస్తుంది. స్టాండ్ కూడా దానంతట అదే వేసుకుంటుంది. ఇందుకోసం ఎటువంటి మానవ ప్రయత్నం అవసరం లేదు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ బైక్‌పై మరిన్ని ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. మరింత నాణ్యంగా, మరిన్ని ఫీచర్లతో త్వరలోనే ఈ బైక్‌లను మార్కెట్లోకి తీసుకొస్తామని బీఎండబ్ల్యూ తెలిపింది.

  • Loading...

More Telugu News