Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.. నోటీసులు జారీ!

  • జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసు
  • 41 సీఆర్సీసీ కింద నోటీసులు
  • ఎన్నికల బిజీ వల్ల విచారణకు హాజరుకాలేనన్న రేవంత్

ఇప్పటికే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణా కేసులో రిమాండ్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. రేవంత్ కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్సీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో ఈ నోటీసులు జారీ చేశారు.

15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ రేవంత్ రెడ్డి సహా 13 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు రేవంత్ స్పందించారు. తాను ఎన్నికల బిజీలో ఉన్నానని... ఈ కారణం వల్ల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు లేఖ రాశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలను కేటాయించారనే ఆరోపణలు రేవంత్ పై ఉన్నాయి. మరోవైపు, రేవంత్ కు నోటీసులు అందడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Revanth Reddy
notice
jubilee hills police
jubilee hills
housing society
congress
arrest
  • Loading...

More Telugu News