USA: ముంచుకొస్తున్న 'ఫ్లోరెన్స్‌'.. అమెరికాను వణికిస్తున్న పెను తుపాన్!

  • అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఏర్పడిన కేటగిరి-1 హరికేన్‌
  • ప్రస్తుతం తూర్పు తీరం వైపు నెమ్మదిగా కదలిక
  • ఈదురు గాలులు, భారీవర్షాలు, వరదలపై తీర గ్రామాలకు హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికాను ‘ఫ్లోరెన్స్‌’ హరికేన్‌ వణికిస్తోంది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడి తూర్పు తీరంవైపు నెమ్మదిగా కదులుతున్న ఈ కేటగిరీ-1 హరికేన్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. ఇది క్రమంగా బలం పుంజుకుంటోందని, రాగల 24 గంటల్లో కేటగిరీ-4 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని అమెరికాలోని జాతీయ హరికేన్‌ కేంద్రం (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. ఈ కారణంగా తూర్పు తీరప్రాంతంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని, కొండచరియలు విరిగి పడతాయని హెచ్చరించింది.

ప్రస్తుతం బెర్ముడాకు 1100 కిలోమీటర్లు ఆగ్నేయంగా హరికేన్‌ కేంద్రీకృతమై ఉందని, గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి ఉత్తర, దక్షిణ కరోలినా మధ్య ఇది తీరం దాటవచ్చునని తెలిపింది. ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో ‘ఫ్లోరెన్స్‌’ తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌సీ హెచ్చరించింది.

USA
  • Loading...

More Telugu News