kovai senthil: తమిళ హాస్య నటుడు కోవై సెంథిల్ కన్నుమూత!

  • కోవైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస
  • గత కొంతకాలంలో అనారోగ్యంతో సతమతం
  • సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు

 తమిళ హాస్య నటుడు కోవై సెంథిల్(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కేవలం హాస్యనటుడిగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆయన రాణించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాణించిన పడయప్పా (తెలుగులో నరసింహా గా డబ్ అయింది) తో పాటు ఇదునమ్మ ఆళు, గోవా తదితర చిత్రాల్లో ఆయన నటించారు.

కోవై సెంథిల్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సెంథిల్ అసలు పేరు కుమారస్వామి. కోవై సమీపంలోని వడవల్లి ఆయన స్వస్థలం. అనారోగ్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెంథిల్ మృతిపై నడిగర్‌ సంఘం సంతాపం వ్యక్తం చేసింది.

kovai senthil
Tamilnadu
kollywood
passed away
  • Loading...

More Telugu News