Sumeet Sachdev: బాస్ పెట్టిన మానసిక ఒత్తిడి వల్లే నా భార్యకు గర్భస్రావం జరిగింది!: హిందీ టీవీ నటుడు సుమీత్

  • గర్భ విచ్ఛిత్తికి మానసిక ఒత్తిడే కారణం
  • ప్రసూతి సెలవుల విషయంలో బాస్‌తో గొడవ
  • న్యాయం కోసం కోర్టులో పిటిషన్ దాఖలు

తన భార్య అమృత గుజ్రాల్ గర్భవిచ్ఛిత్తికి ఆమె బాస్ ప్రహ్లాద్ అద్వానీయే కారణమని హిందీ టీవీ సుమీత్ సచ్‌దేవ్ ఆరోపించాడు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. ప్రసూతి సెలవుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఎటువంటి కారణం లేకుండానే ప్రహ్లాద్.. అమృతపై ఆగ్రహం వ్యక్తం చేశాడని పేర్కొన్నాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గర్భస్రావం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా పిటిషన్‌లో కోరాడు.

చెల్లింపు సెలవులు లేకపోవడంతో ఇంటి నుంచి పనిచేసేందుకు తొలుత అనుమతించి ఆ తర్వాత అద్వానీ దానిని వెనక్కి తీసుకున్నాడని తెలిపాడు. దీంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, ఇది భౌతిక దాడి కంటే ఘోరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మానసిక ఒత్తిడి గర్భ విచ్ఛిత్తికి కారణమైందని ఆయన ఆరోపించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Sumeet Sachdev
Amrita Gujral
Prahlad Advani
miscarriage
  • Loading...

More Telugu News