Telangana: తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీల ఖరారు!

  • ఎన్నికల సమన్వయ, మేనిఫెస్టో, ప్రచార కమిటీలు
  • సమన్వయ కమిటీలో ఎల్.రమణ, దేవేందర్ గౌడ్..
  • ప్రచార కమిటీలో గరికపాటి, సండ్ర ..తదితరులు

తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీ-టీడీపీ ఎన్నికల కమిటీలను ఖరారు చేసింది. ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను నియమించింది. ఎన్నికల సమన్వయ కమిటీలో ఎల్.రమణ, దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు.

మేనిఫెస్టో కమిటీలో దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బి.నర్సింహులు, అలీ మస్కటి, శోభారాణి సభ్యులుగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇక టీ-టీడీపీ ఎన్నికల ప్రచార కమిటీలో గరికపాటి మోహన్ రావు, సండ్ర వెంకటేశ్వరరావు, అరవింద్ కుమార్ గౌడ్, లక్ష్మణ్ నాయక్ రమావత్, కొత్తకోట ఉన్నారు.

  • Loading...

More Telugu News