petrol: పెట్రోలు ధరల పెరుగుదలపై చేతులెత్తేసిన కేంద్రం!

  • డాలర్ బలపడడమే ఇంధన ధరల పెరుగుదలకు కారణం
  • అంతర్జాతీయంగా చమురు ధరల్లో ఒడిదొడుకులు
  • ధరల తగ్గింపు భారత్ చేతుల్లో లేదన్న మంత్రి

విపరీతంగా పెరిగిపోతున్న పెట్రో ధరలను అదుపు చేయడం తమవల్ల కాదని కేంద్రం చేతులెత్తేసింది. ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయంగా పెట్రో ధరల్లో ఒడిదొడుకులు, అమెరికా డాలర్ బలపడడమే ఇందుకు కారణమని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ పేర్కొన్నారు.

రూపాయితో పోలిస్తే డాలర్ బాగా బలపడిందని, అందుకు అనుగుణంగానే పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని ఆయన వివరించారు. ఇరాన్, వెనిజులా, టర్కీ దేశాల్లో చమురు ఉత్పత్తిపై విపరీతమైన ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. చమురు ధరలను నియంత్రించే అవకాశాలు భారత్ చేతిలో ఎంతమాత్రమూ లేవని తేల్చి చెప్పారు.

మరోవైపు, పెట్రో ధరల పెంపునకు నిరసగా సోమవారం కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనకు సిద్ధమవుతోంది. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ తమతో కలిసి రావాల్సిందిగా కోరింది. వామపక్షాలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించగా, ఏపీ, తెలంగాణలలో నిరసనల్లో పాల్గొనాలని జనసేన నిర్ణయించింది. తెలుగుదేశం కూడా నిరసనల్లో పాల్గొననుంది.

petrol
Diesel
Dollar
Rupee
India
Dharmendra pradhan
  • Loading...

More Telugu News