Konda Surekha: కేసీఆర్ ను చిన్న మాట అన్నా.. మీ బతుకేందో చూస్తాం!: కొండా సురేఖకు వరంగల్ మేయర్ నరేందర్ హెచ్చరిక

  • రెండేళ్ల నుంచి మీ తీరును ప్రజలు గమనిస్తున్నారు
  • ఉదయం ఉత్తమ్ ను కలుస్తారు.. సాయంత్రం టీఆర్ఎస్ ఆఫీస్ కు వస్తారు
  • మిమ్మల్ని చూసి భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించిన కొండా సురేఖ, మురళిలపై వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ మండిపడ్డారు. ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుస్తారని, సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వస్తారని... భార్య ఒక దిక్కుకు పోతే, భర్త ఇంకో దిక్కుకు వెళతారని ఎద్దేవా చేశారు. ఈ రకంగా జరుగుతుంటే పార్టీ కానీ, ప్రజలు కానీ కళ్లు మూసుకుని ఉంటారా? అని ప్రశ్నించారు.

'మేడమ్ సురేఖ గారు, వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు గత రెండేళ్ల నుంచి మీ తీరును గమనిస్తున్నారు. మీకు సంబంధించి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో మీకు తెలుస్తుంది' అని అన్నారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి అన్నీ తమవేనని నరేందర్ చెప్పారు. మీ రాజకీయ నైపుణ్యం, మీ బలం, బలగం అన్నీ చూద్దాం, చూసుకుందామని అన్నారు. మరో మహబూబాబాద్ ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ ను చిన్న మాట అన్నా మీ బతుకేందో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని చూసి భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు. 

Konda Surekha
konda murali
warangal
mayor
narender
  • Loading...

More Telugu News