Tirupati: సికింద్రాబాద్, కాకినాడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వేశాఖ!

  • ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నిర్ణయం
  • 8 అదనపు సర్వీసులను నడపనున్న రైల్వే
  • రైళ్లలో స్లీపర్ క్లాస్, సెకండ్, థర్డ్ క్లాస్ ఏసీ బోగీలు

తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-తిరుపతి, కాకినాడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 07429 నెంబర్‌ గల సికింద్రాబాద్‌-తిరుపతి రైలు ఈ నెల 12న రాత్రి 7.45 గంటలకు బయలు దేరి, మరుసటి రోజు ఉదయం 8.10కు తిరుపతికి చేరుకుంటుంది. 07430 నెంబర్‌ గల రైలు ఈ నెల 16న తిరుపతిలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

అలాగే  07559 నెంబర్‌ గల తిరుపతి-కాకినాడ రైలు ఈ నెల 13న రాత్రి 10.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. 07560 నెంబర్‌ గల కాకినాడ-తిరుపతి రైలు ఈ నెల 15న రాత్రి 8.45గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కు తిరుపతికి చేరుకుంటుంది.

అలాగే 07431 నెంబర్‌ గల రైలు ఈ నెల 13న రాత్రి 8.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కు తిరుపతికి చేరుకుంటుంది. 07432 నెంబర్‌ గల రైలు తిరుపతిలో రాత్రి 10.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

ఇక 07001 నెంబర్‌ గల హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌ ఈ నెల 12న రాత్రి 9.05కు బయలుదేరి, కాకినాడ టౌన్‌కు ఉదయం 9.25కు చేరుకుంటుంది. 07002 నెంబర్‌ గల రైలు ఈ నెల 16న రాత్రి 8.30కు కాకినాడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ అదనపు రైళ్లలో సెకండ్‌, థర్డ్‌ క్లాస్ ఏసీ బోగీలు, స్లీపర్‌ క్లాస్‌ కోచ్ లు ఉంటాయి.

Tirupati
Tirumala
rails
Hyderabad
  • Loading...

More Telugu News