nedurumalli: రేపు వైసీపీలో చేరనున్న నేదురుమల్లి రాంకుమార్

  • మాజీ సీఎం నేదురుమల్లి కుమారుడు రాంకుమార్
  • రేపు విశాఖపట్టణంలో జగన్ సమక్షంలో పార్టీలోకి
  • విశాఖకు చేరుకుంటున్న నేదురుమల్లి అనుచరగణం

దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ వైసీపీలో చేరనున్నారు. రేపు విశాఖపట్టణంలో జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల నుంచి నేదురుమల్లి కుటుంబసభ్యులు తమ అనుచరగణాన్ని   విశాఖకు తీసుకెళ్లనున్నారు. గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాలలో, సుమారు రెండు వేల మందిని తరలిచేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, వైసీపీలో తాను చేరనున్నట్టు రాంకుమార్ ఇటీవలే ప్రకటించారు.

nedurumalli
YSRCP
ramkumar
  • Loading...

More Telugu News