Andhra Pradesh: తల్లిని గెలిపించుకోలేని జగన్ మమ్మల్ని ఎలా గెలిపించాడు?: మంత్రి ఆదినారాయణ రెడ్డి ఫైర్

  • విజయమ్మ ఓటమికి జగనే కారణం
  • జగన్ ఫ్యామిలీ కంటే మా కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది
  • పార్టీ ప్రకటన రోజు రాజీనామాలు ఎందుకు కోరలేదు

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆది నారాయణ రెడ్డి ఈ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లిని గెలిపించుకోలేని జగన్ తమను ఎలా గెలిపించాడని ఆయన ప్రశ్నించారు. ఉదయం లేచింది మొదలు సీఎం.. సీఎం అంటూ జగన్ కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆది నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ కుటుంబం కంటే తమ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.

ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆది నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 27 మంది, ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వేదికపైన ఉండగానే జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు. ఆ రోజున జగన్ అందరి నుంచి రాజీనామాలు ఎందుకు కోరలేదు? జగన్ బొమ్మతోనే మేం గెలిచామని వైసీపీ నేతలు అంటున్నారు. మరి వైజాగ్ లో విజయమ్మ ఎందుకు ఓడిపోయారు? తల్లిని గెలిపించలేని జగన్ మమ్మల్ని గెలిపించాడా? ఒకవేళ విజయమ్మ ఓటమికి కారణం తానేనని జగన్ ఒప్పుకుంటే.. మా గెలుపుకు జగనే కారణమని మేమందరం ఒప్పుకుంటాం. మేం ఊరకుక్కలం అయితే నువ్వు ఊరపందివి. జగన్ కుటుంబం కన్నా మా కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. మా నాన్న ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జగన్ ఇంకా పుట్టలేదు’ అని ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
adi narayana reddy
ys jagan
YS Vijayamma
Visakhapatnam District
YSRCP
minister
  • Loading...

More Telugu News