balka suman: బాల్క సుమన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కేసీఆర్

  • చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలుకు టికెట్ నిరాకరించిన కేసీఆర్
  • బాల్క సుమన్ కు చెన్నూర్ టికెట్ కేటాయింపు
  • ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుందని గతంలోనే చెప్పిన బాల్క సుమన్

ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బాల్క సుమన్... తొలి ప్రయత్నంలోనే టీఆర్ఎస్ తరపున లోక్ సభలో అడుగుపెట్టారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని పలు సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. మంత్రి కేటీఆర్ ఆశీస్సులు కూడా బాల్క సుమన్ కు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి విడత జాబితాలో బాల్క సుమన్ పేరు కూడా ఉంది. చెన్నూర్ అభ్యర్థిగా బాల్క సుమన్ పేరును ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలుకు టికెట్ ను నిరాకరించిన కేసీఆర్... ఆయన స్థానంలో బాల్క సుమన్ కు అవకాశం కల్పించారు. 

balka suman
chennur
ticket
odelu
kcr
TRS
  • Loading...

More Telugu News