Chandrababu: బాగానే మాట్లాడారు.. కానీ డబ్బులు మాత్రం తీసుకురాలేకపోతున్నారు: బీజేపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు కామెంట్

  • కేంద్ర నిధులు తీసుకురావడంలో విష్ణు, మాణిక్యాలరావులు విఫలమవుతున్నారు
  • సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం
  • వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

రాష్ట్రంలోని వైద్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, మాణిక్యాలరావులు చాలా బాగా మాట్లాడారని ఆయన కితాబిచ్చారు. అయితే, ఇంత బాగా మాట్లాడుతున్న వారు... కేంద్రం నుంచి నిధులను తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నారని సెటైర్ వేశారు.

కొన్ని ఆసుపత్రుల భవనాలు సరిగా లేవనే విషయంలో వీరితో తాను ఏకీభవిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. అన్ని సబ్ సెంటర్లు, స్కూళ్లు, అంగన్ వాడీ, పంచాయతీ, శ్మశానాల నిర్మాణాలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. గ్రామాల్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే, మన రాష్ట్రంలోనే మెరుగైన వైద్య సదుపాయలను కల్పిస్తున్నామని చెప్పారు.

Chandrababu
vishnu kumar raju
manikyala rao
assembly
hospitals
  • Loading...

More Telugu News