Telangana: తెలంగాణలో పుట్టుకొచ్చిన మరో రాజకీయ పార్టీ!

  • 'యువ తెలంగాణ' పార్టీ ఆవిర్భావం
  • పార్టీని స్థాపించిన జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ
  • యువత, మహిళలకు అవకాశాలు కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యం

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. 'యువ తెలంగాణ' పేరుతో కొత్త పార్టీ ప్రాణం పోసుకుంది. జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమలు ఈ కొత్త పార్టీని స్థాపించారు. బాలకృష్ణారెడ్డి పార్టీ అధ్యక్షుడిగా, రాణి రుద్రమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని పార్టీ కోర్ కమిటీ నిర్ణయించింది. పర్యటనల సందర్భంగా పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, యువత, మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువతకు, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.

రాణి రుద్రమ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వంలో మహిళలకు అవకాశాలు లేకుండా పోయాయన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. యువ తెలంగాణ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాణి రుద్రమ గతంలో టీవీ న్యూస్ రీడర్ గా కూడా పని చేశారు. అనంతరం వైసీపీ నాయకురాలిగా వ్యవహరించారు.

Telangana
yuva telangana
political party
jitta balakrishna reddy
rani rudrama
  • Loading...

More Telugu News