prostitution: సమాజసేవ ముసుగులో వ్యభిచారం.. గుట్టు రట్టు!

  • విజయవాడ పటమటలో వ్యభిచార దందా
  • ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులు అరెస్ట్
  • 12 సెల్ ఫోన్లు స్వాధీనం

సమాజసేవ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులను నగరంలోని పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, పటమటలోని దానయ్య బజారులో నివసిస్తున్న ఇద్దరు మహిళలు సమరం ఆసుపత్రిలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు.

ఈ క్రమంలో అక్కడకు వచ్చే మహిళలను వ్యభిచారం ఊబిలోకి దింపి, సొమ్ము చేసుకుంటున్నారు. దానయ్య బజారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ వ్యభిచారం దందా నడిపిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న సీఐ ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా, నిందితుల నుంచి రూ. 13వేలు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

prostitution
Vijayawada
patamata
social service
  • Loading...

More Telugu News