dalit: టీవీ చానళ్లలో ఇకపై 'దళితులు' అనే పదం వాడకూడదు: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు

  • బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం స్పష్టత 
  • షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ దానికి సరపడే మరో పదాన్ని కానీ వాడాలి
  • ప్రైవేటు టీవీ చానళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

'దళితులు' అనే పదాన్ని ఇకపై టీవీ చానళ్లలో ప్రస్తావించకూడదని కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానళ్లకు ఈ షరతు వర్తిస్తుందని తెలిపింది. బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, మేగజీన్లు, వార్తాపత్రికల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

దళితులు అనే పదం స్థానంలో షెడ్యూల్డ్ కులాలు అనే పదం వాడాలని ప్రైవేటు చానళ్లకు రాసిన లేఖలో కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ సూచించింది. దళితులు అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఇంగ్లీషులో షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కానీ లేదా జాతీయ భాషల్లో దానికి సరిపడు మరో పదాన్ని కానీ ఉపయోగించాలని తెలిపింది. మరోవైపు, ఈ సూచనలు పాటించని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని మాత్రం లేఖలో ప్రస్తావించలేదు. 

  • Loading...

More Telugu News