BJP: ఎన్నికల్లో గెలిచిన ఆనందం.. గంగూలీ స్టైల్లో చొక్కా విప్పేసి గిరిగిరా తిప్పిన బీజేపీ నేత!

  • వార్డు సభ్యుడిగా గెలిచిన బీజేపీ నేత
  • ఆనందం పట్టలేక షర్టు విప్పేసి గంతులు
  • సోషల్ మీడియాలో వైరల్

ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో బీజేపీ నేత ఒకరు చొక్కా విప్పేసి గంగూలీ స్టైల్లో గాల్లో తిప్పుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన చొక్కా విప్పి గాల్లో గిరిగిరా తిప్పుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత నెల 31న కర్ణాటకలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా సోమవారం ఫలితాలు వెల్లడయ్యాయి.

ఈ ఎన్నికల్లో బాగల్‌కోట్ మున్సిపల్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో వార్డు నంబరు 19 నుంచి వీరప్ప సిరగన్నవార్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో ఆయన గెలవడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. గెలిచిన వార్త చెవిన పడగానే ఆనందంతో గంతులేశారు. గతంలో నాట్‌వెస్ట్ ట్రోఫీలో భారత జట్టు గెలవగానే అప్పటి కెప్టెన్ గంగూలీ చొక్కా విప్పేసి గాల్లో తిప్పాడు. ఇప్పుడు వీరప్ప కూడా అచ్చం అలాగే చేశారు. చొక్కా తీసేసి గాల్లో తిప్పుతూ ఆనందంతో గంతులేశారు.

BJP
Veerappa Siragannavar
shirtless
victory
Karnataka
urban local body polls
  • Loading...

More Telugu News