Ravi Shastri: రవిశాస్త్రి గురించి షాకింగ్ న్యూస్.. రెండేళ్లుగా నటి నిమ్రత్‌కౌర్‌తో ప్రేమయాణం!

  • తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నటితో ప్రేమ
  • మూడో కంటికి తెలియకుండా వ్యవహారం
  • టీమిండియా-బాలీవుడ్‌లో హాట్ టాపిక్

భారత క్రికెట్ జట్టుకు.. బాలీవుడ్‌కు ఏదో విడదీయరాని సంబంధం ఉంది. ప్రముఖ క్రికెటర్లందరూ బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లాడిన వారే. ఇటీవలే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మను పెళ్లాడాడు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి (56).. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌ (36) రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారన్నదే ఆ వార్త. అయితే, ఈ విషయాన్ని వీరిద్దరూ ఇప్పటి వరకు ఎక్కడా బయటపెట్టలేదు. దశాబ్ద కాలంగా భార్య రీతూకి దూరంగా ఉంటున్న రవి తనకంటే 20 ఏళ్లు చిన్నదైన  నిమ్రత్‌తో ప్రేమలో పడిన విషయం బయటపడి హాట్ టాపిక్ అయింది.

2015లో ఓ కంపెనీ కార్ల లాంచింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన ఎయిర్‌లిఫ్ట్ మూవీతో నిమ్రత్ కౌర్ పేరు బాలీవుడ్‌లో మార్మోగింది. ప్రస్తుతం నిమ్రత్ ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉండగా, రవి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. కాగా, 1980లలో టీమిండియాలో స్టార్ ఆటగాడిగా ఉన్న రవిశాస్త్రి బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో డేటింగ్ చేశాడు. అయితే, వీరి ఇన్నింగ్స్ కొంతకాలానికే ముగిసింది.

Ravi Shastri
Amrita Singh
Bollywood
Nimrat
Sharmila Tagore
Virat Kohli
  • Loading...

More Telugu News