Paripoornananda: నేడు హైదరాబాద్ కు పరిపూర్ణానంద... భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలకనున్న బీజేపీ!

  • 200 బైకులతో ఎల్బీ నగర్ నుంచి ర్యాలీ
  • ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ, విశ్వహిందూ పరిషత్
  • మధ్యాహ్నం ఒంటిగంటకు రానున్న పరిపూర్ణానంద

శ్రీపీఠం పీఠాధిపతి, హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన పరిపూర్ణానంద స్వామి నేడు హైదరాబాద్ కు రానుండగా, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ, విశ్వహిందూ పరిషత్ లు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో పూజల అనంతరం ఆయన రోడ్డు మార్గాన కోదాడ మీదుగా హైదరాబాద్ వస్తారని వీహెచ్పీ తెలంగాణ అధ్యక్షుడు రామరాజు తెలిపారు.

బీజేపీతో పాటు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతామని, మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ఎల్బీనగర్ కు రానున్నారని చెప్పారు. అక్కడి నుంచి దిల్ సుఖ్ నగర్, కోఠి, బషీర్ బాగ్ మీదుగా ఆయన ఇంటికి చేరుతారని తెలిపారు. కాగా, ఎల్బీ నగర్ నుంచి 200 బైకుల ర్యాలీ నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించింది. యువత ఆయనకు స్వాగతం పలికేందుకు తరలిరావాలని పిలుపునిచ్చింది.

Paripoornananda
Sri Peetham
Hyderabad
Welcome
  • Loading...

More Telugu News