Mancherial District: నడిరోడ్డుపై ముగ్గురమ్మాయిలను వదిలి వెళ్లిన తల్లిదండ్రులు!

  • పాఠశాల ఆవరణలో వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు
  • ఆచూకీ తెలుసుకునేందుకు వెళ్లిన అధికారులు
  • తల్లిదండ్రులు కనిపించక పోవడంతో అనాధాశ్రమానికి బాలికలు

వారు ముగ్గురు అమ్మాయిలు. నడిరోడ్డుపై బిక్కుబిక్కుమంటూ స్థానికులకు కనిపించారు. తర్వాత తమ ముగ్గురు ఆడపిల్లలను ఓ జంట వదిలేసి వెళ్లిపోయిందని తెలుసుకుని బాధపడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరుగగా, చిన్నారులను స్థానికులు అనాధాశ్రమానికి చేర్చారు. వారిలో పెద్దమ్మాయి తమది గోల్ బంగ్లా బస్తీ అని, తండ్రి వాల్మీకి రాజు, తల్లి రాణి అని, తమను వారం క్రితం పాఠశాల ఆవరణలో వదిలేశారని చెప్పింది.

 దీంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, వారి తల్లిదండ్రులు నివసించే ప్రాంతానికి వెళ్లి, వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అప్పటికే వారు ఇల్లు వదిలి వెళ్లినట్టు తెలుసుకున్నారు. వారి ఆచూకీ లభించిన తరువాత పిల్లలను అప్పగిస్తామని, లేకుంటే బాల సదన్ కు తరలిస్తామని అధికారులు తెలిపారు. 

Mancherial District
Bellampalli
On Road
Three Girls
  • Loading...

More Telugu News