stree: హర్రర్ మూవీకి ప్రేక్షకుల ఫిదా.. భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్న 'స్త్రీ'!

  • హిట్ టాక్ తెచ్చుకున్న స్త్రీ
  • రాజ్ కుమార్, శ్రద్దా జంటగా తెరకెక్కిన సినిమా
  • ట్వీట్ చేసిన తరణ్ ఆదర్శ్

రాజ్ కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమర్ కౌశిక్ తెరకెక్కించిన హర్రర్ చిత్రం ‘స్త్రీ’ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్నేళ్ల క్రితం రాత్రిపూట ఓ ఆడ దయ్యం సంచరిస్తూ ప్రజలను చంపేస్తోందంటూ వదంతులు రావడం.. దీంతో దయ్యం ఇంట్లోకి రాకుండా ఉండేందుకు చాలామంది ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ తమ ఇళ్లపై రాసుకోవడం చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఇలాంటి కథాంశంతోనే 'స్త్రీ' చిత్రాన్ని అమర్ కౌశిక్ తెరకెక్కించారు.

తాజాగా గత మూడు రోజుల్లో ఈ సినిమా రూ.31.26 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి చరిత్ర సృష్టించిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. విడుదలైన శుక్రవారం రూ.6.82 కోట్లు, శనివారం రూ.10.87 కోట్లు, ఆదివారం రూ.13.57 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. ఈ సినిమాకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. 

stree
movie
Bollywood
collections
horror movie
  • Error fetching data: Network response was not ok

More Telugu News