Rajamahendravaram: పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్యే!

  • నిన్న వైభవంగా పవన్ బర్త్ డే వేడుకలు
  • గత కొంతకాలంగా ఆకుల పార్టీ మారుతారన్న వార్తలు
  • కొత్త చర్చకు తెరలేపిన ఆకుల

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు నిన్న రాజమహేంద్రవరంలో జరుగగా, నగర ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన పార్టీ మారుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్న వేళ, వేడుకల్లో పాల్గొనడం కొత్త చర్చకు తెరలేపింది. ఇక్కడి గణేష్ చౌక్ లో వేడుకలు జరుగగా, పేదలకు ఆకుల సత్యనారాయణ దుప్పట్లను పంచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గతంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లోనూ పాల్గొన్నానని గుర్తు చేశారు. పార్టీ మారితే, మీడియాకు చెబుతానని, అందర్నీ పిలిచి అల్పాహారం పెట్టించి, శీతల పానీయాలు ఇస్తానని అన్నారు. రాజకీయాలు, కులాలకు అతీతంగా సినీ అభిమానం ఉండాలని, సేవకు ప్రతిరూపం కావాలని ఆయన అభిలషించారు.

Rajamahendravaram
Akula Satyanarayana
Jana Sena
Pawan Kalyan
  • Loading...

More Telugu News