Jabardast: 'జబర్దస్త్' గాలిపటాల సుధాకర్‌ కు గౌరవ డాక్టరేట్‌!

  • 'జబర్దస్త్' కామెడీ స్కిట్ షోలో సుపరిచితుడైన గాలిపటాల సుధాకర్
  • కోయంబత్తూర్‌ రాయల్‌ అకాడమి ఆర్ట్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
  • హర్షం వ్యక్తం చేస్తున్న పాలమూరు వాసులు

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితమైన 'జబర్దస్త్' కామెడీ స్కిట్ షోలో సుపరిచితుడైన గాలిపటాల సుధాకర్ కు తమిళనాడుకు చెందిన కోయంబత్తూర్‌ రాయల్‌ అకాడమి ఆర్ట్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను ప్రకటించింది.  కళారంగంలో దేశవ్యాప్తంగా సుమారు ఐదు వేలకు పైగా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చినందుకుగాను గుర్తింపుగా సుధాకర్ కు ఈ డాక్టరేట్ లభించింది. 8వ తేదీన దుబాయ్‌ లో జరగనున్న ఓ కార్యక్రమంలో డాక్టరేట్‌ ను సుధాకర్ కు ప్రదానం చేయనున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన సుధాకర్‌, పలు 'జబర్దస్త్' స్కిట్ లలో కనిపించి అలరించాడు. తమ ప్రాంత నటుడికి డాక్టరేట్‌ రావడంపై పాలమూరుకు చెందిన అభిమానులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

Jabardast
Galipatala Sudhakar
Doctorate
  • Loading...

More Telugu News