kcr: ‘నేను తెలంగాణ పిచ్చోణ్ని’ అని సమాధానమిచ్చా: సీఎం కేసీఆర్
- నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బర్దన్ మద్దతు కోరా
- ఆయనతో అనేకసార్లు సమావేశమయ్యా
- ‘నువ్వేమైనా పిచ్చోడివా? అని బర్దన్ ప్రశ్నించారు
నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు కోరేందుకు అప్పటి సీపీఐ జాతీయ కార్యదర్శి బర్దన్ ని తాను కలిసినప్పటి ఓ సంఘటనను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కొంగరకలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నాడు బర్దన్ తో అనేకసార్లు తాను సమావేశమయ్యానని, ఓసారి ఆయన తనను ‘నువ్వేమైనా పిచ్చోడివా? అని ప్రశ్నించారని చెప్పారు. ‘అవును.. నేను తెలంగాణ పిచ్చోణ్ని’ అని సమాధానం చెప్పానని, ఆ సమాధానానికి సంతృప్తి చెందిన బర్దన్ తమ ఉద్యమానికి చేయూత నిచ్చారని చెప్పుకొచ్చారు.