kct: ప్రగతి నివేదన సభలో కిరణ్ కుమార్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్!

  • తెలంగాణ వస్తే చిమ్మ చీకటైపోతుందని చెప్పారు
  • అద్భుతమైన ప్లానింగ్ చేసి, 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి చేరుకున్నాం
  • చిమ్మ చీకటైపోతుందనే స్థాయి నుంచి ఇంతగా ఎదిగాం

కొంగరకలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలను సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ వస్తే చిమ్మ చీకటైపోతుందని, అంధకారమైపోతుందని ఎన్నో మాటలు చెప్పారని గుర్తు చేశారు. అటువంటి పరిస్థితుల్లో అద్భుతమైన ప్లానింగ్ చేసి ఫలితాలను రాబట్టామని.... విద్యుత్ ఉద్యోగులు అహోరాత్రులు శ్రమించి రాష్ట్రం చిమ్మచీకటైపోతుందన్న స్థాయి నుంచి 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారని చెప్పారు. దేశంలో రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు. 

kct
kiran kumar reddy
pragathi nivedana sabha
  • Loading...

More Telugu News