helicopter: రెండు హెలికాప్టర్లలో కొంగరకలాన్ కు మంత్రులు!

  • బేగంపేట విమానాశ్రయంలో హెలికాఫ్టర్లు
  • సీఎం కేసీఆర్ కోసం మరో హెలికాఫ్టర్ సిద్ధం
  • సాయంత్రం 5 గంటలకు కొంగరకలాన్ కు కేసీఆర్

మరికొన్ని గంటల్లో కొంగరకలాన్ లో ప్రగతి నివేదన సభ ప్రారంభం కానుంది. ఈ సభకు హాజరయ్యే నిమిత్తం తెలంగాణ మంత్రులు బయలుదేరారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రెండు హెలికాఫ్టర్లలో వారు బయలుదేరి వెళుతున్నారు. సీఎం కేసీఆర్ కోసం మరో హెలికాఫ్టర్ ను సిద్ధంగా ఉంచారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ సభ వద్దకు చేరుకోనున్నారు.

కాగా, తెలంగాణలోని 31 జిల్లాల నుంచి కొంగరకలాన్ కు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు చేరుకుంటున్నారు. కొంగరకలాన్ కు వెళ్లే రోడ్డు మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. ప్రగతి నివేదన సభ వద్ద మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

helicopter
kongarakalan
  • Loading...

More Telugu News