kcr: శ్రీరాముడి వేషంలో కేసీఆర్ ఫ్లెక్సీ!

  • కొంగర కలాన్ గులాబీ జెండాల మయం
  • నీలమేఘ శ్యాముడి రూపంలో కేసీఆర్
  • అమ్ములపొది, విల్లు ధరించిన వైనం

ప్రగతి నివేదన సభ జరగనున్న కొంగర కలాన్ ప్రాంతం టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు, నేతల కటౌట్లతో నిండిపోయింది. ముఖ్యంగా, సీఎం కేసీఆర్ కటౌట్లను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో శ్రీరాముడి రూపంలో కేసీఆర్ ఉండటం ఆసక్తిదాయకం.

నీలమేఘ శ్యాముడిగా ఉన్న కేసీఆర్ తలకు కిరీటం, వీపునకు అమ్ములపొది, చేతిలో విల్లు పట్టుకుని చిరునవ్వుతో ఆయన ఉండటం ఆకట్టుకుంటోంది. ‘ప్రగతి నివేదన సభకు స్వాగతం..సుస్వాగతం’ అని ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆహ్వానం పలుకుతూ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

kcr
kongarakalan
  • Loading...

More Telugu News