Uttar Pradesh: ప్రియురాలి కోసం రాత్రి పూట వెళితే... కళ్లు పీకేశారు!

  • ఉత్తరప్రదేశ్ లోని కఛౌనాలో ఘటన
  • ఓ యువతిని ప్రేమించిన అష్రఫ్
  • రాత్రి పూట వెళితే చూసి చావగొట్టిన బంధువులు

తన ప్రియురాలిని కలుసుకునేందుకు రాత్రి పూట వెళ్లిన ప్రియుడిని గమనించిన కుటుంబ సభ్యులు, దారుణంగా కొట్టి, కళ్లు పెరికివేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కఛౌనాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ముహల్లా ఇస్లాంనగర్ నివాసి అష్రఫ్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉంది. ఆమెను ప్రేమించిన అష్రఫ్, రాత్రిపూట కలుసుకునేందుకు వెళ్లాడు. దీన్ని గమనించిన ప్రియురాలి బంధువులు, అతన్ని పట్టుకుని చావగొట్టారు. అంతటితో ఆగకుండా, అతని కళ్లను పెకలించి, రోడ్డుపక్కన పారేసి పోయారు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాఫ్తు ప్రారంభించారు.

Uttar Pradesh
Lover
Night Time
Eyes
  • Loading...

More Telugu News