Kadapa District: కేంద్ర మంత్రి హెగ్డేకు కడప ‘ఉక్కు’ సెగ.. మంత్రి కారుపై బూటు విసిరినా మహిళా కార్యకర్త!

  • మంత్రి కారును అడ్డుకున్న కమ్యూనిస్టులు
  • కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు డిమాండ్
  • మంత్రి కనీసం కారు దిగకపోవడంపై ఆగ్రహం

కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డేకు తీవ్ర పరాభవం ఎదురైంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేయాలని కోరుతూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఈ రోజు మంత్రిని అడ్డుకున్నారు. పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించేందుకు మంత్రి ఈ రోజు కడప వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద మంత్రి కారును నిలువరించిన నేతలు.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వీరిని లాగి పక్కకు పడేశారు. ఈ నేపథ్యంలో అనంత్ కుమార్ కారు ఆగకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారుపై బూటును విసిరారు.

కడప ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంత కుమార్ హెగ్డే కదలకుండా లోపలే ఉండిపోయారు. కనీసం బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. వెంటనే పోలీసులు కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలను పక్కకు లాగి పడేశారు. కనీసం తమ గోడును వినకుండా మంత్రి ముందుకెళ్లడంతో ఆగ్రహానికి లోనైన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారును వెంబడించి మరీ బూటును విసిరారు.

Kadapa District
SHOE
WOMAN
attack
steel factory
demand
  • Loading...

More Telugu News