harikrishmna: సిద్ధమైన హరికృష్ణ విగ్రహం.. అందుకోనున్న జూ.ఎన్టీఆర్!

  • పశ్చిమ గోదావరి శిల్పుల తయారీ 
  • రేపు హరికృష్ణ జయంతి
  • అందుకోనున్న హీరో జూ.ఎన్టీఆర్

తెలుగుదేశం సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కన్నుముూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కాగా, సెప్టెంబర్ 2న హరికృష్ణ జయంతి సందర్భంగా ఇద్దరు నందమూరి అభిమానులు ఆయన విగ్రహాన్ని రూపొందించారు.

పశ్చిమ గోదావరికి చెందిన శిల్పులు డా.పెనుంగొండ అరుణ్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్ లు హరికృష్ణపై అభిమానంతో ఆయన విగ్రహాన్ని తయారుచేశారు. హరికృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ విగ్రహాన్ని ఆయన చిన్న కుమారుడు జూ.ఎన్టీఆర్ కు అందజేస్తామని తెలిపారు. తాము కేవలం అభిమానంతోనే ఈ విగ్రహాన్ని తయారుచేసినట్లు అరుణ్, కరుణాకర్ స్పష్టం చేశారు.

harikrishmna
statue
Telugudesam
NTR
September 2
  • Loading...

More Telugu News