Redmi: మూడు సిరీస్ లలో షియోమీ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి!

  • షియోమీ నుండి రెడ్ మీ 6, 6 ప్రో, 6ఏ
  • ఈనెల 5న విడుదల చేసే అవకాశం
  • కొన్నిరోజుల క్రితమే చైనాలో విడుదల

షియోమీ కంపెనీ నుండి మూడు సిరీస్(రెడ్ మీ 6, 6 ప్రో, 6ఏ) లలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈనెల 5న వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. చైనాలో కొన్నిరోజుల క్రితమే 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో 'రెడ్ మీ 6ఏ' విడుదల కాగా, 'రెడ్ మీ 6', 'రెడ్ మీ 6 ప్రో' లు 3/4 జీబీ ర్యామ్, 32/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లతో విడుదల అయ్యాయి.

ఈ సిరీస్ ప్రకారంగానే భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. షియోమీ అభిమానుల కోసం త్వరలోనే నూతన స్మార్ట్‌ఫోన్‌ లు తీసుకురానున్నామని షియోమీ ఇండియా అధిపతి మను కుమార్ జైన్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశాడు. కాగా, క్రింద ఇవ్వబడిన ధరలలో ఈ ఫోన్ లు లభ్యం అయ్యే అవకాశం ఉంది.

  • 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 'రెడ్ మీ 6ఏ' ఫోన్ ధర సుమారుగా రూ. 6300
  • 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల 'రెడ్ మీ 6' ‌ఫోన్‌ ధర సుమారుగా రూ. 8400
  • 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల 'రెడ్ మీ 6' ఫోన్‌ ధర సుమారుగా రూ. 10500
  • 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల 'రెడ్ మీ 6 ప్రో' ఫోన్‌ ధర సుమారుగా రూ. 10400
  • 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల 'రెడ్ మీ 6 ప్రో' ఫోన్‌ ధర సుమారుగా రూ. 12500
  • 4జీబీ ర్యామ్,64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల 'రెడ్ మీ 6 ప్రో' ఫోన్‌ ధర సుమారుగా రూ. 13600

Redmi
Redmi 6
Xiaomi
smartphone
Tech-News
technology
India
China
  • Error fetching data: Network response was not ok

More Telugu News