roja: వేయికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలంటూ.. హైకోర్టులో వైసీపీ నేత రోజా పిటిషన్!

  • ప్రజల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం దెబ్బతీస్తోంది
  • దీనిపై అధికారులు స్పందించలేదు 
  • జగన్ సీఎం కాగానే మండపాన్ని పునర్నిర్మిస్తాం

తిరుమలలో కూల్చివేసిన వేయికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మండపాన్ని పునర్నిర్మించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వేయికాళ్ల మండపాన్ని కూల్చివేయడం దారుణమని అన్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అయినా ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే వేయికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని తెలిపారు.

roja
Tirumala
veyikalla mandapam
High Court
petition
  • Loading...

More Telugu News