vijaykanth: విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు.. నమ్మొద్దన్న డీఎండీకే!

  • సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్
  • అనారోగ్యానికి గురయ్యారంటూ వదంతులు
  • నమ్మొద్దంటూ పార్టీ విజ్ఞప్తి

తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేసింది. ఇటువంటి వార్తలను ప్రచారం చేయవద్దని సూచించారు. విజయ్‌కాంత్ శుక్రవారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు రావడంతో పుకార్లు హల్‌చల్ చేశాయి.

ఆయన అనారోగ్యానికి గురయ్యారంటూ వదంతులు వ్యాపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తుండడంతో పార్టీ స్పందించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరారని, నేడు డిశ్చార్జ్ అవుతారని స్పష్టం చేసింది. పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరింది.

vijaykanth
Tamilnadu
Chennai
Actor
DMDK
Hospital
  • Loading...

More Telugu News